జగన్ కు ఏపీ బిజెపి డిమాండ్ లు…!

-

రేపు జరిగే అపెక్స్ కమిటీ మీటింగ్ లో లో ఏపీ ప్రభుత్వం ధీటుగా స్పందించాలని ఏపీ ప్రభుత్వానికి బిజెపి సూచించింది. రాయలసీమ అంశం, తెలంగాణలో కృష్ణా గోదావరి నదులపై కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లాంటి నిర్ణయాలపై మాట్లాడాలని పేర్కొంది. కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ప్రణాళికాబద్ధంగా నీటి విషయాలపై అవగాహన పెంచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఎపి లో ముఖ్యమంత్రులు అందరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ఇరిగేషన్ శాఖకు మంత్రులుగా నియమించారని అన్నారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత గడిచిన ఆరు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తుందని చెప్పింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరూ కనీసం నోరు మెదపలేదని మండిపడ్డారు. కేసిఆర్, జగన్ మోహన్ రెడ్డి మంచి స్నేహ శీలమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి నుండి రాయలసీమకు నీటిని తోడుకునే విషయం పై చర్చించాలని సూచించారు. కెసిఆర్ కేంద్రం మీద ధ్వజమెత్తుతూ రాజకీయాలు చేసే వైఖరి వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రుల మీద, కేంద్ర ప్రభుత్వం పట్ల వివాదాస్పద వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఉభయ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసారు. రాయలసీమ గత అనేక సంవత్సరాలుగా రతనాల సీమగా పిలువబడుతుందని, అయినా త్రాగు, సాగు, నికర జలాలు లేని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ మరొక అద్భుతమైన ధాన్యాగారాన్ని కోల్పోతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమ పాత్ర ప్రముఖమైనదని అన్నారు. వివాదాస్పదమైన, రాష్ట్రాల్లో వ్యతిరేకతను నిర్మాణం చేసే భావజాలం భాజపా విధానం కాదని ఏపీ బిజెపి స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version