సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్ధిస్తున్నాను అని BJP ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమే అయితే అల్లు అర్జున్ పై చర్యలు కరెక్టే. బ్రహ్మాండంగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రికి మెసేజ్ పెట్టాను. బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలని నా అభిప్రాయం. ఇవ్వాల్సి వచ్చినా పోలీసులు పర్మిషన్, సెక్యూరిటీ కల్పించాలి.
హీరోలకు ఒక చట్టం, సామాన్యులకు మరొక చట్టం ఉండదు. హైదారాబాద్ వంటి ఘటనలు మన దగ్గర జరక్కుండా ఉండాలంటే ముందస్తు చర్యలు అవసరం. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు సరైనది కాదు. మానవత్వంతో మాట్లాడే మాటలను, చర్యలను ప్రాంతాలతో సంబంధం లేకుండా చూడాలి. A -11 గా వున్న అల్లు అర్జున్ ధియేటర్ కు వెళ్ళినందు వల్లే తొక్కిసలాట జరిగింది.. అందుకు హీరో బాధ్యుడే. ఐత్ర్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.. మా పార్టీ స్టాండ్ తో సంబంధం లేదు అని విష్ణుకుమార్ రాజు క్లారిటీ ఇచ్చారు.