ఏపీ బీపీ : జ‌గ‌న్ వెర్సస్ బొత్స ! నిజ‌మేనా నిజ‌మేనా !

-

రాష్ట్ర రాజకీయాల్లో ఒక‌నాటి సంచ‌ల‌నం బొత్స
కానీ ఇప్పుడు మౌనానికి ప్ర‌తీక .. మాట్లాడినా కూడా
జ‌గ‌న్ ఏం చెప్పారో ఎంత వ‌ర‌కూ మాట్లాడ‌మ‌ని చెప్పారో
ఆ విధంగా ఆయ‌న ముందుకు వ‌స్తున్నారు.. కాదండి
మీడియా ముందుకు వెళ్లేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేస్తున్నారు
అని రాయాలి. ఎందుకంటే …. అక్క‌డ జ‌గ‌న్ ఏం చెబితే అదే
ఫైన‌ల్ అయి ఉంటుంది క‌నుక ! ఆయ‌న నిర్ణ‌యాల‌కు ఎదురు అన్న‌ది
ప్ర‌స్తుతానికైతే లేదు క‌నుక ! అందుక‌నో ఎందుక‌నో చాలా నిర్ణ‌యాలు
ఏక ప‌క్ష‌మే ! అన్న‌ది ఫ్యాన్ పార్టీ నుంచి వినిపిస్తున్న మాట ! ట ట ట ట !

ఆంధ్రావ‌ని వాకిట రాజకీయాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఈ ద‌శ‌లో యువ ముఖ్య‌మంత్రి జ‌గన్-కూ, విద్యాశాఖ మంత్రి బొత్స కూ మ‌ధ్య వైరం ఏర్ప‌డింది అని తెలుస్తోంది. ఇదంతా ఓ ప్రాథ‌మిక స‌మాచారం అనుస‌రించి రాస్తున్న క‌థ‌నం. రాజ్య‌స‌భ కు పంపే ప్ర‌తినిధుల విష‌య‌మై పార్టీ త‌ర‌ఫున ఎంపిక చేసిన పేర్ల విష‌య‌మై బొత్స చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. పైకి ఆ విష‌యం చెబితే ఎక్క‌డ పార్టీ అధిష్టానం కోపానికి గురి అవుతానో అని ఆయ‌న ఒక‌టికి వంద సార్లు ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా ముఖ్య‌మంత్రి త‌న‌తో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయించ‌డం వ‌ర‌కూ బాగానే ఉన్నా, ఎంపిక‌ల్లో ఏ విధంగా ప్రాధాన్యాంశాల‌ను ఎంచుకున్నారో, లేదా ఏయే విష‌యాల‌ను ప్రామాణికంగా తీసుకున్నారో అన్న‌ది ఆయ‌న‌కు అంతుపోల‌డం లేదు. జ‌గ‌న్ ఎంపిక చేసిన నాలుగు పేర్ల‌లో ఆర్.కృష్ణ‌య్య (తెలంగాణ ప్రాంతానికి చెందిన బీసీ నేత) కీల‌కంగా ఉండ‌డం బొత్స కోపానికి కార‌ణం అయింది.

వాస్త‌వానికి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మ‌హిళా నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరును ఫైన‌ల్ చేస్తార‌ని బొత్స తోస‌హా క్యాబినెట్ అంతా అనుకుంది. కానీ అదేమీ కాకుండా ఆఖ‌రులో ఆర్.కృష్ణయ్య పేరు ఫైన‌ల్ చేయ‌డంతో బొత్స ఆగ్ర‌హంతో ఊగిపోయారు అని కూడా తెలుస్తోంది. వ‌ద్దండి ఆయ‌న మ‌న‌కు ఏ విధంగా కూడా హెల్ప్ కారు, కాబోరు అని కూడా చెప్పారు అని తెలుస్తోంది. లేదన్నా నాపై తీవ్ర ఒత్తిడి ఉంది.. ముందు మీరు మీడియా ముందుకు వెళ్లి ఆ నాలుగు పేర్లూ ప్ర‌క‌టించి రండి. మీతో పాటూ స‌జ్జ‌ల కూడా వ‌స్తారు అని చెప్పి పంపార‌ని స‌మాచారం

Read more RELATED
Recommended to you

Exit mobile version