పచ్చళ్లు పెట్టే సమయంలో పూలను ఎందుకు పెట్టుకోకూడదో తెలుసా?

-

తెలుగు వాళ్ళ ప్రియమైన ఆహారం అంటే అవకాయ అని అందరికి తెలుసు..మనకు పచ్చళ్లకు అంతగా విడదీయరాని బంధం ఉంది.. అమ్మను మర్చిపోలేము.. అలాగే అవకాయను కూడా మర్చిపోలేము అని తెలుగు వాళ్ళ నోట్లో ఎప్పుడూ నానుతుంది..ఎండాకాలం వచ్చింది అంటే పచ్చళ్లు పెట్టడం లో మన ఆడపడుచులు బిజీ అయిపోతారు.తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటా మామిడి పచ్చళ్ల ప్రిపరేషన్ స్టార్ అవుతుంది. ఈ తరుణంలోనే చాలా మంది మామిడి పచ్చడితో పాటుగా, వివిధ రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు. పచ్చడి పెట్టడంలో చాలా అనుభవం అవసరం.

అయితే,చాలా మంది ఈ మధ్య యూట్యూబ్ లో చూసి పచ్చళ్ల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే సఫలం అవుతుంటారు. ఉప్పో, కారమో లేదా ఇంకేదైనా పదార్థమో తగ్గిందంటే ఇక పచ్చడి సంగతి మర్చిపోవాల్సిందే.ముక్కలు ఎంతగా మగ్గితే అంతగా రుచి వస్తుంది.అలాగే రోజూరోజుకూ దాని టేస్ట్ పెరుగుతూ ఉండాలి. కానీ ఏమాత్రం తగ్గిన భావన కలగకూడదు. పచ్చడి చేసే సమయంలో కొన్ని మెలకువలు పాటించాలి.సాధారణంగా పచ్చడి పెడితే ఒక్కోసారి బూజు పడుతుంది. దీని ప్రధాన కారణం శిలింద్రాల జాతికి చెందిన ఒక జీవి.

ఈ బూజు అనేది ఉష్ణోగ్రత తక్కువైనా, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నా బూజు పడుతుంది.పచ్చళ్ల లో ఉప్పు ఎక్కువ అయితేనే త్వరగా బూజు పట్టదని పెద్దలు అంటున్నారు..పచ్చళ్లను పెట్టడానికి ముందుగానే మామిడి ముక్కలను బాగా కడిగి తుడిచి తడి లేకుండా చేసి పచ్చడి పెట్టే జాడీలు కూడా బాగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. అందులో ఎలాంటి సూక్ష్మ క్రిములు లేకుండా చూడాలి. ఆడవారు నిల్వ పచ్చడి చేసేటప్పుడు తలలో పూలు కూడా పెట్టుకోరు. ఇలా పూలు పెట్టుకోవడం వల్ల పచ్చడి చేసే సమయంలో ఏమైన అందులో పొరపాటుగా పడిపోతే పచ్చడి అంతా చెడిపోతుంది.అంతే కాదు వాటి వాసన వల్ల కూడా పచ్చళ్లు చెడిపోయే ప్రమాదం ఉందని పెద్దలు చెబుతున్నారు..అందుకే పచ్చళ్లను పెట్టిన తర్వాత కూడా జాడీ నుంచి తీసేటప్పుడు కూడా పూలను పెట్టుకోరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version