కేసీఆర్ స‌ర్కార్ పై విజయశాంతి సంచలన ట్వీట్‌..రోజులు దగ్గరపడ్డాయంటూ !

-

కేసీఆర్ స‌ర్కార్ పై విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ కు రోజులు దగ్గరపడ్డాయంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ స‌ర్కార్ అవినీతికి, అక్ర‌మాల‌కు అండగా నిలుస్తోందని… రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. ములుగు జిల్లా పరిధిలో గోదావరి ఒడ్డున ఉన్న పొలాలను… ఇసుక మేటల తొలగింపు పేరుతో అక్రమార్కులు పరిమితికి మించి ఇసుక తవ్వేస్తున్నారని…. భారీ వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు సాగు భూముల్లో ఇసుక మేటలు వేస్తుందని ఫైర్ అయ్యారు. వీటిని తొలగిస్తేనే మళ్లీ పొలం సాగు చేసుకునేందుకు వీలుంటుంది. రైతుల పేరిట అనుమతులు తీసుకుని… అక్రమార్కులు ఇసుక తవ్వి తోడేస్తున్నారని ఆగ్రహించారు.

పొలాల్లో ఇసుక తరలించేందుకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని… తీరం నుంచి దాదాపు కిలోమీటరు లోపలి వరకు ర్యాంపు నిర్మించి నది మధ్యలోంచి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు. దీంతో రూ.60 కోట్లతో కట్టిన గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. ములుగు జిల్లా పరిధిలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక దందా చేసేందుకు హైదరాబాద్, నల్గొండకు చెందిన బడా వ్యాపారవేత్తలు, లీడర్లు పోటీ పడి మ‌రీ ఇసుక‌ను త‌ర‌లిస్తున్నారని ఆగ్రహించారు.ఈ కేసీఆర్ ప్ర‌భుత్వంలో పైర‌వీకారుల‌కి, బడా బాబుల‌కి త‌ప్ప మరెవరికీ న్యాయం జ‌ర‌గడం లేదు. ప్ర‌భుత్వ ఆస్తిని అడ్డ‌గోలుగా దోచుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు బుద్ధి చెప్పే రోజు తొంద‌ర్లోనే రానుందని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version