ఏపీ కేబినేట్ మీటింగ్ ఎప్పుడు…? ఏమో ఎవరికి తెలుసు…?

-

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ పై సర్వత్రా ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర కేబినేట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కేబినేట్ భేటీ ఎప్పుడు జరుగుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ముందు ఈ నెల 20 న జరగాల్సిన కేబినేట్ భేటీని ఈ రోజు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి వెలువడింది.

అయితే ఇప్పుడు ఈ భేటీని మళ్ళీ మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ వాయిదా వేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. సోమవారం రోజునే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీన్ని వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే రాజధాని మార్పు విషయంలో జగన్ కేబినేట్ నిర్ణయానికి ముందుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించాలని భావించారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా ని కలవాలని శనివారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే అనూహ్యంగా వారి అపాయింట్మెంట్ జగన్ కి దొరకలేదు. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని జగన్ కేబినేట్ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సోమవారం అయినా జరుగుతుంది అనే స్పష్టత లేదు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలిదు. అందుకే ఇప్పుడు కేబినేట్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియడం లేదు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version