తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. రాజకీయంగా అధికార తెరాసను దెబ్బ కొట్టేందుకు గాను విపక్షాలు ఈ ఎన్నికల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కడా కూడా అసమ్మతులు లేకుండా తెరాస అధిష్టానం, ఆ పార్టీ కీలక నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ లో ఈ ఎన్నికలు మరింత హీట్ పెంచుతున్నాయి. బిజెపి ఎంపీ అరవింద్ వర్సెస్, తెరాస నేతలుగా మారిపోయింది.
నిజామాబాద్ మేయర్ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారని అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ కాకుండా ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే ప్రెస్ క్లబ్ నుంచి కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తానని షాకింగ్ సవాల్ చేసారు. అరవింద్‌లా బాండ్ పేపర్లు రాసి మాట మార్చే అవసరం తమకు లేదన్న ఆయన,
తాము చేసిన పనులను బీజేపీ మేనిఫెస్టోలో రాసుకున్నారన్నారు. భైంసా అల్లర్లపై నిజామాబాద్ లో దీక్ష చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. అంతగా చెయ్యాలని భావిస్తే అక్కడికే వెళ్లి దీక్ష చేయాలని హితవు పలికారు. ఎవరెన్ని చేసినా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఎంపీ అరవింద్‌కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రావాలని సవాల్ చేసారు.