ఎల్లుండే ఏపీ కేబినేట్‌ సమావేశం… వీటిపైనే చర్చ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం ఎల్లుండి జరుగనుంది. సీఎం క్యాంప్‌ ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏపీ కేబిననేట్‌ సమావేశం జరుగనుంది. కేబినెట్ అజేండాలో టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుల అంశం పై చర్చ జరుగనుంది. అంతేకాదు…టీటీడీ పాలక మండలి నియామకం వివాదం నేపథ్యంలో చట్ట సవరణ చేసే దాని పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

jagan

నవంబర్ మాసం లో అసెంబ్లీ సమావేశాల లో తీర్మానం చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే 52 మందితో పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితులను నియమించింది ఏపీ ప్రభుత్వం. దీంతో 52 మంది నియామకం పై హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. పిటీషన్లు వేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జిఓలను తాత్కలికంగా సస్పెండ్‌ చేసింది హైకోర్టు. ఇలాంటి తరుణంలో ఎల్లుండి కేబినేట్‌ సమావేశం జరగడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. టీటీడీ విషయంతో పాటు… రైతుల సమస్యలు, కరోనా పరిస్థితులపై కేబినేట్‌ సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version