ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 1908 కేసులు

-

మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ లో పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1908 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,77,363 కి పెరిగింది.

covid third wave | కోవిడ్ మూడో వేవ్

ఒక్క రోజు వ్యవధిలో మరో 23 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,513 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2103 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 80,376 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,51 , 08 , 146 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,43,475 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version