ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేసారు. ఇంత మంది తెలుగు వాళ్ళు అంటారు అనుకోలేదు. ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం బిజెపికే ఓటు వెయ్యాలి. ఢిల్లీలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ నాయకత్వం గొప్పగా ఉందంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ను ప్రమోట్ చేస్తోంది ప్రధాన మంత్రి. 1995 లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడను. ఇపుడుఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నా. బిజెపి గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు.
ఐటీ రంగంలో భారతీయులను ఎదుర్కొనే వాళ్ళు ప్రపంచంలో లేరు. సరైన నాయకుడు సరైన సమయంలో దేశానికి మోడీ నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం భారత దేశం బ్రాండ్ మోగుతోంది. ప్రధాని మోడీ దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతున్నారు. 2047 నాటికి శక్తివంతంగా దేశం మారుతోంది. 1995 లో పాడుబడిన హైదారాబాద్ లా ఢిల్లీ మారింది. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ గా ఉంది. ఢిల్లీ నుంచి అందరూ హైదారాబాద్, బెంగుళూరు వెళ్తున్నారు. వెదర్ పొల్యూషన్, రాజకీయ కాలుష్యంతో ఢిల్లి కలుషితం అయింది. గర్వపడేలా దేశ రాజధాని ఉండాలి. ఊపిరి పిల్చుకోవాలంటే, ప్రధాని మోడీ ఆక్సిజన్ ఇస్తేనే సాధ్యం. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి. భారత దేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంది. కానీ ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో ఉంది అని చంద్రబాబు అన్నారు.