కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ మీద విశ్రాంతి లేకుండా పోరాటాలు చేస్తుంటే జగన్ మాత్రం ఈ విషయంలో వివాదాస్పద వైఖరితో ముందుకి వెళ్ళడం అనేది ఇప్పుడు అక్కడి ప్రజలకు చికాకుగా మారింది. బాధ్యతగల స్థానంలో ఉండి కూడా జగన్ వ్యవహరిస్తున్న శైలి ఇప్పుడు బాధ్యతా రాహిత్యంగా ఉంది.
కరోన వైరస్ ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకం. ఆయన మాట్లాడే మాటలే ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయి. ప్రజల్లోకి ముఖ్యమంత్రుల మాటలు బలంగా వెళ్తాయి. అలాంటి విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు ఇప్పుడు. వరుసగా మీడియా సమావేశాలు ముఖ్యమంత్రులు నిర్వహించి దాని పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో చెప్తున్నా సరే… జగన్ మాత్రం మాట్లాడటం లేదు.
దీనితో ఆయన సామర్ధ్యంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇంత సీరియస్ అంశం విషయంలో జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేది కొందరి మాట. ఆయన ముందు మందు బిళ్ళలు వేసుకుంటే అని మాట్లాడి తర్వాత బ్లీచింగ్ అని మాట్లాడి ఇప్పుడు దాన్ని జ్వరం మందులు తింటే తగ్గుతుంది అనడం చూస్తుంటే ఆయనలో దీనిపై ఒక పట్టుదల లేదు అని అర్ధమవుతుంది అంటున్నారు.
ప్రపంచ దేశాలకు కరోనా ఒక భూతంలా మారినా జగన్ మాత్రం ఈ విషయ౦లో ఎంత సేపు తేలికగా కొట్టేస్తూ అది ఒక సాధారణ విషయం అని చెప్పడంలో సాధారణంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు గాని కరోనా వైరస్ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చుక్కలు చూపిస్తుంది. వాలంటీర్లను ఆశా వర్కర్లను పొగడటం, ఇప్పుడు దానికి మందులు వేసుకుంటే తగ్గుతుంది అనడం చూస్తుంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటీ అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి.