మిస్సింగ్ యూ నాన్న.. ఫేస్‌బుక్‌లో జగన్ భావోద్వేగ పోస్టు

-

ఇప్పుడు నేను ఇలా ఉన్నాను..అంటే దానికి కారణం మీ ఆశీస్సులు, మీరు నేర్పిన పాఠాలే. మిస్సింగ్ యూ నాన్న. మీరు ఇప్పుడు మాతో ఉంటే ఎంత బాగుండేది.. హ్యాపీ ఫాదర్స్ డే.. అంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు ఏపీ సీఎం.

ఇవాళ ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. తన తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. నిజానికి వైఎస్ జగన్.. తండ్రిని మించిన తనయుడు. వైఎస్సార్ ఆశయాలను ప్రస్తుతం తను కొనసాగిస్తున్నారు.

తన తండ్రి చనిపోయాక ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి.. చివరకుయ ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు.

సో.. ఫాదర్స్ డే సందర్భంగా ఫేస్‌బుక్‌లో తన తండ్రి వైఎస్సార్ గురించి జగన్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేసి.. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను..అంటే దానికి కారణం మీ ఆశీస్సులు, మీరు నేర్పిన పాఠాలే. మిస్సింగ్ యూ నాన్న. మీరు ఇప్పుడు మాతో ఉంటే ఎంత బాగుండేది.. హ్యాపీ ఫాదర్స్ డే.. అంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు ఏపీ సీఎం.

Read more RELATED
Recommended to you

Exit mobile version