మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్…?

-

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అవుతుంది.. 2019 మే చివరిలో జగన్…సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పుడు అవకాశం దక్కని వారి మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి అవకాశం కల్పిస్తానని అన్నారు. అంటే ఇప్పటికీ దాదాపు రెండున్నర ఏళ్ళు అవుతుంది. దాని బట్టి చూసుకుంటే డిసెంబర్‌లో మంత్రివర్గంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

jagan

ఇక మంత్రివర్గంపై ఇప్పటికే అనేకరకాలుగా ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి సగం మంత్రులని తప్పిస్తారని, మరొకసారి 80 శాతం అని, కాదు కాదు 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేయడం ఖాయమని చెప్పారు. దీంతో మంత్రులంతా టెన్షన్ పడుతూ ఉన్నారు.

ఎప్పుడు పదవి ఊడిపోతుందా? అని ఆందోళనలో ఉన్నారు. కానీ తాజాగా జగన్….తన మంత్రివర్గంలో చిన్న మార్పు చేశారు. ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖతో పాటు వాణిజ్య పన్నుల శాఖని కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి చూసుకుంటున్నారు. అయితే తాజాగా వాణిజ్య పన్నుల శాఖని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. అంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్‌శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కొనసాగనున్నారు.

అయితే ఈ మార్పుతో జగన్…మంత్రులకు ఒక హింట్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఒకవేళ డిసెంబర్‌లోనే మంత్రివర్గంలో మార్పులు చేయాలని అనుకుంటే…ఇప్పుడు ఈ మార్పు చేయాల్సిన అవసరం ఉండేది కాదు…అంటే మరో ఆరు నెలలు మంత్రులకు మళ్ళీ సమయం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అందరు మంత్రులని పక్కనబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే బుగ్గన లాంటి మంత్రులని పక్కనబెడితే కాస్త కష్టమే అని చెప్పాలి. ఏదేమైనా జగన్..మంత్రులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version