ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 601462కు పెరిగింది.
ఒక్కరోజు వ్యవధిలో మరో 72 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5177కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 88197 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు కొత్తగా 10,712 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 508088 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.