ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక హెల్త్ బులిటెన్ ప్రకారం మొత్తంగా 16,238 శాంపిల్స్ ను పరీక్షించగా, అందులో 1155 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 23 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తంగా నేడు ఒక్కరోజే 1178 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 238 కేసులు నమోదయ్యాయి.
అలాగే రాష్ట్రం మొత్తంగా అత్యధికంగా నేడు ఒక్కరోజే 762 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,200 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 252 కు చేరుకుంది.