ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 79 కేసులు, సున్నా మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త తగ్గాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 79 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2318417 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో ఒక్కరు కూడా చనిపోలేదు.

ap carona

కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 729 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1063 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 167 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2302625 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 14,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 33181869 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

https://twitter.com/ArogyaAndhra/status/1500441910414290944?s=20&t=iYDtN6wASaxMv6YMYcb_Rw

Read more RELATED
Recommended to you

Exit mobile version