కడపలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..

-

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం జరిగింది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో పలు శకటాలను మైదానంలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పనితీరును శకటాల రూపంలో ప్రదర్శించారు. కానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చెందిన పంచాయతీ రాజ్ శాఖ శకటం పూర్తిగా చినిగి పోయింది. ఆ శకటాన్ని అలానే ప్రదర్శించడం పట్ల జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే చిరిగిన శకటాన్ని ప్రదర్శించారని జనసైనికులు ఆరోపించారు. ఇటీవల డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ ను చేయాలని తెలుగుతమ్ముళ్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అందుకే తమ అభిమాన హీరో, డిప్యూటీ సీఎంకు అవమానం జరిగేలా కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version