ఆసుపత్రి పై డ్రోన్ దాడి.. 70 మంది మృతి

-

సూడాన్ లోని డార్ఫర్ ప్రాంతంలోని అప్ ఫాషర్ నగరంలో ఘోరాది ఘోర హింస వెలుగులోకి వచ్చింది. అక్కడి ఏకైక ఆసుపత్రి పై జరిగిన డ్రోన్ దాడిలో దాదాపు 70 మందికి పైగా మరణించారు. ఈ దాడి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ ఘటన గురించి చర్చనీయాంశమైంది. దాడి జరిగిన సమయంలో ఆసుపత్రి పేషెంట్లతో నిండి ఉంది. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది.

 

అల్ ఫాషర్ నగరంలో నడుస్తున్న సౌదీ టీచింగ్ మెటర్నర్ హాస్పిటల్ పై జరిగిన దాడిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది సహా 19 మంది మరణించారని WHO వెల్లడించింది. ఆ సమయంలో ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. WHO డైరెక్టర్ జనరల్ ఈ ఆసుపత్రిపై దాడి ఘటన చాలా బాధకరమైనదని ట్వీట్ లో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, రోగులపై మిగతా ప్రపంచం ఎలా ఉందో ఇది సూచిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version