ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల మీద వరుస దాడుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఆలయాల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వాస్తవాలు, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. కరోనా, సహా పోలీసులు అనేక ఛాలెంజ్ లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
అలానే ఇప్పటికే కరోనా బారినపడి 109 మంది పోలీసులు మరణించారని పేర్కొన్నారు. 2020లోనే దేవాలయాలకు సంబంధించిన 143 ఘటనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు అధికారుల కులం మతం గురించి మాట్లాడటం తన 38 ఏళ్ళ సర్వీసులో ఒక్క సారి కూడా వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసుల మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారి.ఒక రకంగా అంతర్వేది రథం దగ్గర తర్వాత ఇలాంటి దేవాలయాల మీద దాడులు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.