పట్టాభిపై ఏపీ డీజీపీ ఫైర్‌.. ఆయన మాట్లాడిన భాష దారుణం!

-

తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌ పై నిప్పులు చెరిగారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదని… ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యన్తరం కర వ్యాఖ్యలు చెయ్యకూడదని ఫైర్‌ అయ్యారు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశామని… పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదని తేల్చి చెప్పారు.

పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదని….. ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారని మండిపడ్డారు. పరేడ్ లో…బ్యాండ్ జరుగుతున్న సమయం లో నాకు నిన్న వాట్స్ యాప్ కాల్ వచ్చిందని…నిన్న సాయంత్రం 5.03 గంటలకు నాకు కాల్ వచ్చింది…కానీ ఆ సౌండ్స్ లో మాట్లాడలేక పోయానని చెప్పారు. చట్ట ప్రకారం ఈ ఘటనకు కారకులైన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పుననావృతం కాకుండా చూస్తామ న్నారు ఏపీ డీజీపీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version