AP:అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన

-

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. బడ్జెట్ కసరత్తును ఆర్థిక శాఖ ఓ కొలిక్కి తేలేకపోతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలా..?రెండు మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? అనే గందరగోళంలో ఆర్థిక శాఖ ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలకు పూర్తి వివరాల్లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతోనే సమస్య అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

గత వైసిపి ప్రభుత్వం మాదిరి తప్పుడు లెక్కలతో బడ్జెట్ పెట్టొద్దని అధికారులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రతి శాఖలోనూ లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు అన్నారు. వివిధ శాఖల ఖాతాల్లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లెక్కలు కొలిక్కి రావడం లేదు. పూర్తి స్థాయి బడ్జెట్ ఈ పరిస్థితుల్లో కష్టమంటూ ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి విషయాల్లో స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version