పీవీ సింధుకు 2 ఎక‌రాల భూమిని కేటాయించిన ఏపీ సర్కార్

-

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూర‌ల్ చిన గ‌దిలి గ్రామంలో రెండెక‌రాలు భూమి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. చిన గ‌దిలిలోని సింధుకు కేటాయించిన భూమిని ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయిస్తూ ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకుంది. ఆ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్త‌ర్వులు జారీ చేసింది. భూమిని ఉచితంగా ఇస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్.

అకాడ‌మీని రెండు ఫేజుల్లో నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వానికి తెలిపిన పీవీ సింధు… ఒక్కో దశలో రూ. 5 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమి ఉప‌యోగించాల‌ని స్పష్టం చేసింది ప్రభుత్వం. వాణిజ్య అవ‌స‌రాల‌ కోసం వాడ‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది. అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version