అమరావతి: కరోనా వేరియెంట్ ఎన్ 440కే పై ఏపీ సర్కారు వివరణ ఇచ్చింది. ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కె ఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది జూన్, జులైలో ఈ స్ట్రైన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక నమూనాల నుంచి సీసీఎంబీ గుర్తించిందని చెప్పారు. ఏపీలో 2021 ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గిందన్నారు. ఇప్పుడు ఈ రకం వైరస్‌ను చాలా తక్కువగా గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సౌత్ ఇండియా నమూనాల నుంచి బి.1.617, బి1 గుర్తించామని తెలిపారు. ఏప్రిల్ నెల డేటా ఆధారంగా ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని గ్రహించామని స్పష్టం చేశారు. యువకుల్లో సైతమ్ దీని వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించిందన్నారు. అయితే ఎన్ 440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్ రెడ్డి తెలిపారు.