ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్రప్రదేశ్‌లోని ఆలయాల పాలకమండళ్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 14 వందల 48 ఆలయాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల లోపు ఆదాయం ఉన్న 13 వందల 88 ఆలయాలకు, కోటి లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ అయ్యింది.
పాతిక లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ఏడుగురు, కోటి లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు 9 మంది చొప్పున సభ్యుల నియమించనున్నారు. ప్రతీ ట్రస్ట్ బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 శాతం, మహిళలకు 50 శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు.