పదో, ఇంటర్ ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం…

-

ఏపీలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల రద్దుతో.. ఆ పరీక్ష ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం పై ఇవాళ విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్  మరియు ఇంటర్ ఫలితాల కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదిమూలపు. ఫలితాలను వెల్లడించేందుకు మూల్యాంకనం ఎలా ఉండాలన్న దానిపై నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు.

పరీక్ష ఫలితాలను నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంభించాల్సిన విధి- విధానాల పై ఆయన అధికారులతో చర్చించారు. కాగా ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ మరియు టెన్త్ పరీక్షలను  ఏపీ సర్కార్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version