ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నియమితులైన గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి ఈనెల 30 వరకు జీతం చెల్లిస్తుందని చెప్పారు.
అలాగే 1,92,848 మంది వాలంటీర్లకు గాను విధుల్లో ఉన్న 1,85,525 మంది 1,50, 661 మందికి అక్టోబర్ 1న గౌరవ వేతనం 7,500 ల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్టు తెలిపారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామని పేర్కొన్నారు.