జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఓ వైపు పవన్ తాను సినిమాల్లోకి రానని చెపుతూనే ఉన్నా పవన్ రీ ఎంట్రీ వార్తలు మాత్రం షురూ అవుతనూ ఉన్నాయి. పవన్ ఎన్నికలకు ముందే ముగ్గురు, నలుగురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ నిర్మాతల నుంచి పవన్‌పై తమకో సినిమా చేసి పెట్టడం లేదా తమ అమౌంట్ ఇవ్వాలని ఒత్తిళ్లు వస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇక పవన్ వచ్చే ఐదేళ్ల వరకు చేసేదేం ఉండదు. ఈ క్రమంలోనే తాను అడ్వాన్స్‌లు తీసుకున్న నిర్మాతలకు ఈ లోగా సినిమాలు చేసేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సైరా ప్రీ రిలీజ్ వేడుకలో చాలామంది పవన్ రీ ఎంట్రీ ఖరారు అన్నట్లే మాట్లాడడం మరోసారి పవన్ రీ ఎంట్రీ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో తమిళ్ డైరెక్టర్ హరి పవన్ ను కలవడం ప్రస్తుతం చర్చ గా మారింది.
సూర్యతో సింగం సీరిస్ సినిమాలతో హరి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇక హరి పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ టెర్రిఫిక్ స్టోరీని సిద్ధం చేసి పవన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.