ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. టోఫెల్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

-

విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ సర్కారు ఈటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్, ఉన్నతాధికారులు, ఈటీఎస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యార్థులను టోఫెల్ దిశగా తీర్చిదిద్దడంపై ఈటీఎస్ తో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు. ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్ మాట్లాడుతూ, ఇది ఏపీలో విద్యారంగం స్వరూపాన్ని మార్చే కార్యక్రమం అని అభివర్ణించారు. సీఎం జగన్ దార్శనిక నాయకత్వంలో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అభివృద్ధి దిశగా ముందడుగు అని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version