రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు డిపాజిట్ కూడా రాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటలకు ఎంత సేపు సానుభూతి రాజకీయమే కావాలన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మీడియా అంటే ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ఇద్దరు ముగ్గురు ఈటల యూట్యూబ్ ఛానల్ బ్రోకర్లు నాపై, సీఎం కేసీఆర్‌పై, మంత్రి హరీష్ రావుపై కట్టు కథలు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద న్యూస్ కవరేజ్ కోసం….ఓ యూట్యూబ్ ఛానెల్ కెమెరామెన్ వెళ్లారు. అయితే అదే సమయంలో సంక్షేమ పథకాలపై ఓ మహిళ….ఎమ్మెల్సీని నిలదీస్తుండగా కెమెరామెన్ క్లిక్‌మనిపించాడు. ఇది గమనించిన కౌశిక్‌రెడ్డి…వీడియోలు తీస్తావా అంటూ కెమెరామెన్‌ను దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా కారులోకి తీసుకెళ్లిపోయాడు.
తమ కెమెరామెన్‌ను 3 గంటల పాటు తన దగ్గర పెట్టుకుని కొట్టారని….యూట్యూబ్ ఛానెల్ ఓనర్ శివరాం రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా తనకు ఫోన్ చేసి మరీ బెదిరించారని ఆరోపించారు. ఫోన్ తన దగ్గరే పెట్టుకుని తర్వాత కెమెరామన్‌ను మాత్రం వదిలేశారని తెలిపారు.