ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..ఆ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ రద్దు

-

గత ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన చాలా విషయాలని, కార్యక్రమాలని రద్దు చేస్తూ పోతోంది. తాజాగా అదే బాటలో నడుస్తూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ (RSCL) రద్దు చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ ను రద్దు చేస్తున్నామని చెబుతూ ఉత్తర్వులు జారే అయ్యాయి.

ap govt decided to increase districts

రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ బోర్డు మీటింగులో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారాలు జరగనున్నాయి. ఇక గత కొద్ది కాలంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించడం లేదు. కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయమని కోరీ కోరీ విసుగు చెంది టీడీపీ హయాంలో ఈ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version