Keerthy Suresh: పెళ్లిపై హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కీలక ప్రకటన

-

Keerthy Suresh : పెళ్లిపై హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటన చేశారు హీరోయిన్‌ కీర్తి సురేష్‌. అతి త్వరలోనే ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు హీరోయిన్ కీర్తి సురేష్. 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

Keerthy Suresh makes her relationship Instagram official with husband-to-be Antony

కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పలేదని వివరించారు కీర్తి సురేష్. ఆంటోనీ అలాగే కీర్తి సురేష్ పేరును క్యాప్షన్ చేసి… పోస్ట్ పెట్టారు హీరోయిన్ కీర్తి సురేష్. అలాగే వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది.

వాసవంగా చిన్నప్పటి నుంచి కీర్తి సురేష్ అలాగే ఆంటోనీ కలిసి చదువుకున్నారట. ఇంటర్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. ఇటీవల కీర్తి సురేష్ తండ్రి కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇక వీళ్ళ ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు.. నచ్చడంతో… దగ్గరుండి పెళ్లి కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version