మాగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల అరెస్టు!

-

రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మాగనూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ గురుకుల ఉన్నత పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం పలువురు విద్యార్థి సంఘాట నేతలు జెడ్పీ పాఠశాల సందర్శనకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల వద్ద భారీగా భద్రతను మోహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఫుడ్ పాయినింగ్ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version