అమరావతి రైతులకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ రాజధాని పరిధిలోని భూమి లేని పేదలకు ప్రభుత్వం ఫించను విడుదల చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను 4 విడత పెన్షన్ మొత్తం రూ. 16.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని భూమి లేని పేదల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ కమిషనరును ప్రభుత్వం ఆదేశించింది.
నిజానికి అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని(పెన్షన్) కొత్త ప్రభుత్వం రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్ పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ.5.2 కోట్లు, ఏడాదికి రూ.60.30 కోట్ల భారం పడనుంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు.