కరోనా టీకా వేసుకున్న జో బైడెన్.. కీలక ప్రకటన

-

అన్ని దేశాల కంటే అమెరికాలో కరోన టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. మనకు రాదని లైట్ తీసుకున్నారో ఏమో కానీ ఎక్కువగా అక్కడే కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల వినియోగానికి అత్యవసర అనుమతులు ఇచ్చి మరీ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇవి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయని భావించి చాలా మంది దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 జో బైడెన్‌, భార్య జిల్  వ్యాక్సిన్‌ ను వేయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోస్ ని ఆయన డెలావర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ను అమెరికా టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వ్యాక్సీన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  ప్రజల్లో అపోహను తొలగించడానికే తాను టీకా వేసుకుంటున్నట్టు బైడెన్‌ తెలిపారు. మరోపక్క ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్,  ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version