అమ్మ ఒడి పథకం పై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్ లో ప్రతి రోజు విద్యార్థుల హాజరు నమోదు చేయాలని పేర్కొంది. ఇక ఈ నెల 8 నుండి ఏప్రిల్ 30 వరకు ఉండే హాజరును ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. ఇది ఇలా ఉంటే అమ్మ ఒడి పథకాన్ని 2020 జనవరి లో ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కు ప్రతి ఏడాది రూ రూ.15వేల రూపాయలు నేరుగా ఇస్తున్నారు.
ఈ డబ్బును విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు సహాయం అందించడంతో పాటు స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పెంచవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక హాజరు శాతం తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.