తెలంగాణ ఆర్టీసీ ని లాభాల బాట పట్టించాలంటే టీఎస్ ఆర్టీసీ ఛార్జీలను స్వల్పంగా పెంచాలని ఆర్టసీ యాజమాన్యం భావిస్తుంది. అందుకు అనుగూణంగా రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మెన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు పలువురు అధికారులు ఒక ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేశారు. తాజా ఆ ముసాయిదా ప్రతిపాదన తెంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ వద్ద కు చేరుకుంది.
ఈ ప్రతిపాదనను ముఖ్య మంత్రి కేసీఆర్ ఆమోదిస్తే.. తెలంగాణ లో ఆర్టీసీ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. దీని ప్రకారం పల్లె వెలుగు, ఆర్డనరీ బస్సులలో ప్రతి కిలో మీటరు కు 25 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. అలాగే ఎక్స్ ప్రెస్, మెట్రో బస్సులకు ప్రతి కిలోమీటరు కు 30 పైసల చోప్పున ఛార్జీలు పెరగనున్నాయి. అయితే గత కొద్ధి రోజుల నుంచి టీఎస్ ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతుంది. నష్టాల ను కట్టెక్కించడానికిఏ ఎండీ సజ్జనార్ ను చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.