ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

-

ఏపీ హైకోర్టులో ఇటీవల నియామకమైన అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన వారిలో మహేశ్వరరావు కుంచం, చంద్రధన శేఖర్‌, గుణరంజన్‌లు ఉన్నారు. హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్ వీరితో ప్రమాణం చేయించారు.ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం మే 15న మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌లతో పాటు ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజా­బాబు, గేదెల తుహిన్‌ కుమార్‌ పేర్లను కూడా అదనపు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ కేంద్రానికి పంపింది.

ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించి వీరిలో ముగ్గురికి ఆమోద ముద్ర వేస్తూ ఈ నెల 15న తీర్మానం పంపింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వీరి నియామకం జరిగింది. తాజాగా ముగ్గురి నియామకంతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి చేరింది. కాగా, మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version