సోషల్ మీడియా అరెస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అలా అయితే సినిమా హీరోలను,విలన్ లను కూడా అరెస్ట్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో ‘గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే’! అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.దీనిపై కర్నూల్లో టీడీపీ నేత ఫిర్యాదుతో కర్నూల్ పోలీసులు గుంటూరుకు వెళ్లి ప్రేమ్ కుమార్ను అరెస్ట్ చేశారు.
పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రేమ్ కుమార్ కొడుకు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరగగా.. కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం అంటూ పోలీసుల తీరుపై మండిపడింది.కర్నూల్ సీఐను ఈ కేసుల్లో స్పందించినంత వేగంగా మిగతా కేసుల్లో స్పందిస్తున్నారా? ఇప్పటివరకు ఎన్ని కేసులను ఇలా మెరుపు వేగంతో విచారించారని హైకోర్టు ప్రశ్నించింది.