పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

-

గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రక్రియను మరో నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 ఆన్సర్ పేపర్స్ కరెక్షన్ ను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన..ఏపీ హైకోర్టు.. గ్రూప్-1 పరీక్షల ఇంటర్వ్యూల నిర్వహణపై స్టే ఇచ్చింది.  దీంతో ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి.

గ్రూప్-1 పరీక్షల ఇంటర్వ్యూల నిర్వహణపై స్టే ఇచ్చిన హై కోర్టు..  అభ్యర్థుల ఆన్సర్ షీట్స్ కోర్టుకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే  ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హైకోర్టు ఆదేశాలతో గ్రూప్-1 ఇంటర్వ్యూలను నాలుగు వారాల పాటు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ..తదుపరి ఇంటర్వ్యూల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version