అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్..ఫోటో వైరల్

-

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న చెప్పినట్లుగానే.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ ఉదయం నందినగర్‌ లోని తన ఇంటి నుంచి బయలు దేరిన కేసీఆర్.. అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం అయింది.

BRS chief KCR participates in assembly meetings

ఈ తరుణంలోనే… అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని తెలిపారు. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని… ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version