హెబియస్ కార్పస్ పిటిషన్లు, ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలపై హైకోర్ట్ లో ఈరోజు విచారణ జరిగింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విచారణను పునఃపరిశీలించాలని ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వ పిటిషన్ ను హైకోర్ట్ ధర్మాసనం తిరస్కరించింది. ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలకు అనుమతులు, పోలీస్ రక్షణ మీద న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించింది.
ఎప్పట్నుంచో జరుగుతోన్న అమరావతి ఉద్యమానికి మైక్స్, టెంట్లకు అనుమతి ఇవ్వకుండా మూడు రాజధానులుండాలని ఆందోళన చేసేవారికి అనుమతులిచ్చారని ధర్మాసనం దృష్టికి లాయర్ ప్రణతి తెచ్చారు. మూడు రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని వ్యాఖ్యానించిన హైకోర్ట్, మేము వస్తుంటే ఆ శిబిరంలో వాళ్లు మాకు నల్ల బ్యాడ్జీలు చూపిస్తన్నారని హైకోర్ట్ ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంలో కలెక్టర్ కు, పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా.. సంయమనంతో వ్యవహరిస్తున్నామని అది ద్రుష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.