ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఆగ్రహం…! పార్లమెంట్ పై మోడీ ఫోటో ఉందా…?

-

పంచాయితీ ఆఫీస్ లపై వైసీపీ రంగులపై ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పంచాయితీలకు వేసే రంగులు పార్టీ రంగులు వేరు వేరు అని ప్రభుత్వ లాయర్ అనగానే… రంగులను మేము పోల్చుకోగలమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయితీ ఆఫీసులపై సిఎం ఫోటో ఎందుకు ముద్రించారని హైకోర్ట్ ప్రశ్నించింది.

రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టే ముద్రించామని ప్రభుత్వ లాయర్ చెప్పగానే న్యాయవాది వ్యాఖ్యలపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ పై ప్రధాని ఫోటో సుప్రీం కోర్ట్ పై సీజే ఫోటో ఉందా అని ధర్మాసనం నిలదీసింది. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని ప్రభుత్వ లాయర్ ని ప్రశ్నించింది. ప్రస్తుతం తమకు ఎలాంటి అధికారం లేదని ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.

మీకు లేకపోతే మేమే తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ జెండా రంగు గుర్తులను కోర్ట్ ముందు ఉంచాలని జడ్జి ఆదేశించారు. విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్ట్.ఇటీవల విచారణ సందర్భంగా హైకోర్ట్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులు ఎందుకు వేసారని…? ఎన్నికల కమీషన్ వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version