విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

-

ఇటీవల ఏపీలో ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పేపర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు జూన్‌25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని వివరించారు మంత్రి బొత్స. ప్రకటించిన ఇంట‌ర్మీడియ‌ట్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షల ఫ‌లితాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా విద్యార్థులు 72శాతం మంది ఉత్తీర్ణత సాధించగా కడప జిల్లా విద్యార్థులు అత్యల్పంగా 50శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 8లక్షల 69వేల 059 మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 45వేల 604 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4లక్షల 23వేల 458 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు మంత్రి బొత్స. ఒకేషనల్‌ కోర్సులో 72వేల 299 మంది విద్యార్థులు పాల్గొన్నారని, మొదటి సంవత్సరంలో 2లక్షల 41వేల 591 మంది ఉత్ణీర్ణులయ్యారని మంత్రి బొత్స వివరించారు. ఉత్తీర్ణత 54శాతం కాగా రెండవ సంవత్సరంలో 2లక్షల 58వేల 449 మంది పాసయ్యారని తెలిపారు. 61శాతం మంది పాసయ్యారని మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలురు 49శాతం, బాలికలు 60శాతం, రెండో సంవత్సరంలో 54శాతం బాలురు, బాలికలు 68శాతం పాసయ్యారని మంత్రి వెల్లడించారు మంత్రి బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version