వైసీపీ అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడింది : మంత్రి సత్య కుమార్

-

ఇవాళ జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ కలిశారు. ఏపీలో రాజకీయ అంశాలు, స్థానిక ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించాం. త్వరలో జాతీయస్థాయిలో అధ్యక్ష మార్పులుంటాయి. ఏపీలో కూడా మార్పులు ఉంటాయో లేదో నేను చెప్పలేను అని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు.

రాష్ట్రంలో పరిస్థితులను వివరించి, ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాను.అలాగే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్య విభాగాన్ని భ్రష్టుపట్టించిన విధానాన్ని కూడా వివరించాను అని తెలిపారు. 11 టీచింగ్ మెడికల్ కాలేజీలు ఉంటే, 6 కాలేజీల్లో మాత్రమే క్యాత్ లాబ్స్ ఉన్నాయి. మిగతా 5 కాలేజీలకు క్యాథ్ లాబ్స్ మంజూరు చేయాలని కోరాను.

క్యాన్సర్ కి సంబంధించి మరికొన్ని కేంద్రాలు మంజూరు చేయాలని కోరాను.NHM నుంచి నిధులు మంజూరు చేసే ప్రొవిజన్ లేదన్నారు. అయితే రూ. 300 కోట్లు మంజూరు చేయాలని కోరాను. సానుకూలంగా స్పందించారు.అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను పాత జిల్లాల లెక్కన మంజూరు చేశారు.కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఆ ప్రకారం మంజూరు చేయాలని కోరాను.గ్రామీణ ఆరోగ్య మందిర్ల నిర్మాణానికి సహకారం అందించాలని కోరాను.ఆరోగ్య మందిర్లలో సిబ్బందికి జీతాలు చెల్లించడం కోసం రూ. 1,000 కోట్లు అందించాలని కోరాను.సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలంటే ఇవన్నీ అమలు చేయాలని చెప్పాను.వైసీపీ అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిందని వివరించాను అని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version