ఏపీ మంత్రి అనిల్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత టెండర్ జరిగిందో.. రివర్స్ టెండరింగ్‌తో ఎంత జరిగిందో ఓ సీఎంగా, ప్రతిపక్ష నేతగా మారినంత తేడా ఉందని గుర్తించాలని అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌తో దాదాపుగా రూ.780కోట్లు ఆదా అయితే అభినందించాల్సిన చంద్రబాబు విమర్శించడం ఏమిటన్నారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే అవినీతికి అస్కారం లేని పాలన అందించాలనే సంకల్పంతో పోలవరంలో రివర్స్ టెండరింగ్ జరిపినట్లు అనిల్ యాదవ్ వివరించారు. చంద్రబాబు పాలనతో అవినీతి ఎజెండాగా పనిచేసిన విషయం పోలవరం రివర్స్ టెండరింగ్‌తో బయటపడిందన్నారు. చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రీ టెండరింగ్ వద్దని రాద్దాంతం చేస్తుందన్నారు.
దోపిడికి అలవాటు పడిన టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా గప్‌చుప్‌గా ఉండకుండా పోలవరం పనులు ఆగిపోయాయని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరంలో ఇప్పుడు వరద కొనసాగుతుందని అందుకే పనులను నిలుపుదల చేసామని, నవంబర్‌లో పనులు ప్రారంభించి రెండేళ్ళలో పోలవరంను పూర్తి చేస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. రెండేళ్ళలో పోలవరం పూర్తి చేస్తే టీడీపీ పార్టీని మూసేస్తారా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు అనిల్ యాదవ్. పోలవరం పనులను నామినేషన్ పద్దతిలో అప్పగించి చంద్రబాబు పెద్ద తప్పు చేసాడని, టెండర్ల వేసి కాంట్రాక్టు పనులు అప్పగిస్తే తప్పని విమర్శించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ కేవలం విమర్శకుల మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని, 20వేల కోట్ల పనులను కేవలం నవయుగ సంస్థకు కెటాయించి భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నవయుగ సంస్థ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనడానికి ముందుకు రాలేదు కానీ, నామినేషన్ పద్దతిలో పనులను చేజిక్కుంచుకుందని గుర్తు చేశారు. టీడీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు.