ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

-

ఆంధ్రప్రదేశ్ లో పాలక ప్రతిపక్షాల తో పాటు దాదాపు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 71 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్ లకు ఈ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 2214 డివిజన్లకు గాను 7549 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి.

 

elections

ఇక మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు గాను 7915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ తీవ్రత దృష్ట్యా పలు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తిరిగి 13 వ తారీకున రీపోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తిరిగి తర్వాతి రోజు అంటే 14 వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అలాగే ఫలితాల విడుదల ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version