ఏపీలో రాజకీయాల వేడి పెరిగింది. వరసగా ట్వీట్లు, విమర్శలతో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వరసగా విమర్శలు చేస్తున్నారు. నేతలపై విమర్శలకు ట్విట్టర్ వేదిక అవుతోంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన విమర్శలు చేశారు. టీడీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యలతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ లో ఆసక్తికర విమర్శలు చేశారు. అప్పులు, పొత్తుల విమర్శలపై పవన్ ట్వీట్ చేశారు. శ్రీలంక నుంచి తమిళనాడు గంట దూరం..శ్రీలంక పరిస్థితకి ఏపీ కూతవేటు దూరం… ఇంకా పొత్తుల గురించి విమర్శించడం, గడప గడపకు ఎమ్మెల్యేను పంపపడం కాదు… చేసిన అప్పుల నుంచి ఏపీని దూరం చేసేందుకు ప్రయత్నించాలని ట్వీట్ చేశారు.