మెడ్ టెక్ ఎవరిదైతే ఏంటి .. ముందు పని మొదలుపెట్టండి మహానుభావా !

-

కరోనా వైరస్ వ్యాధి ఉన్న కొద్ది రాష్ట్రం లో వేగంగా విస్తరిస్తున్న తరుణంలో  విశాఖ మెడ్‌టెక్ జోన్ లో తయారు అయినా వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపు వెయ్యి కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కో కిట్ ద్వారా 20 మందికి పరీక్షలు చేయించవచ్చు. ఈ నేపథ్యంలో మరో వారంలో పది వేల కోట్లను అందుబాటులోకి తీసుకురావటానికి ఏపీ సర్కార్ రెడీ అయింది. ఇటీవల కరోనా వైరస్ నియంత్రణ సమీక్ష సమావేశంలో ఏపీ సీఎం జగన్ కోవిడ్-19 రాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రారంభించారు. ఇదే పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు అసలు విశాఖ లో మెడ్‌టెక్ జోన్ వచ్చిందంటే అది చంద్రబాబు చలవే అని తాజాగా వచ్చిన వార్తలపై ప్రతిస్పందించారు.చంద్రబాబు ముందు చూపు ప్రస్తుతం రాష్ట్రానికి కీలక సమయంలో ఉపయోగపడిందని విశాఖ మెడ్‌టెక్ జోన్‌ నుంచి కరోనా కిట్లు తయారయి బయటకు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా 2014 టైం లో నరేంద్ర మోడీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సమయంలో చంద్రబాబు భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీ కి మంచి స్కోప్ ఉందని గుర్తించి విశాఖలో మెడ్‌టెక్ జోన్‌కు కృషి చేశారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా ఆయన ఆలోచనలు రాష్ట్రాన్ని కాపాడుతున్నాయి అని గొప్పగా చెప్పుకుంటున్నారు.

 

ఇదే సమయంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అసలు మెడ్‌టెక్ జోన్‌ కేంద్రంగా చంద్రబాబు అనేక కుంభకోణాలకు తెగబడ్డారు అని.. అసలు ఈ రాపిడ్ కిట్లు బయటకు రావడానికి కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ కి కౌంటర్లు వేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో టిడిపి మరియు వైసీపీ నేతలు చేస్తున్నహడావుడి నెటిజన్లు ఖండించారు. మెడ్ టెక్ ఎవరిదైతే ఏంటి అవతల ప్రాణాలు పోతున్నాయి ముందు పని మొదలుపెట్టండి, రాజకీయాలు పక్కన పెట్టండి మహానుభావులు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంటే మీరు మాత్రం ఒకరితో ఒకరు… ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటారా..? మానవత్వం గా ఆలోచించండి రాజకీయాలు పక్కన పెట్టండి అని సూచిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version