నితిన్ కు రమ్యకృష్ణ విలన్ గా మారుతుందా…?

-

టాలీవుడ్ లో ఇప్పుడు రమ్యకృష్ణ కు డిమాండ్ పెరిగింది. బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి అనే పాత్ర ఆమె కెరీర్ గ్రాఫ్ ని మరింతగా పెంచింది అనే చెప్పవచ్చు. నరసింహ సినిమా తర్వాత ఆమెకు ఆ స్థాయిలో మరోసారి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి. ఆ రెండు సినిమాల్లో ఆమె లేకపోతే మాత్రం ఆ పాత్ర తేలిపోయి ఉండే అవకాశం ఉందని పలువురు సిని ప్రముఖులు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆమెకు ఆ సినిమా ఆ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఆమెకు మరోసారి విలన్ పాత్ర పోషించే అవకాశం వచ్చింది అంటున్నారు. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న అందాదున్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారని అంటున్నారు. ఆ సినిమా ఒరిజినల్ మాతృకలో టబు నెగటివ్ రోల్ చేసారు. తెలుగులో ఎవరు చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూసారు.

ఇప్పుడు ఆ పాత్రకు రమ్య కృష్ణ ను ఎంపిక చేసారు. ముందు అనసూయ పేరు వినపడింది. కాని ఆమె అందుకు సరిపోయే అవకాశం లేదని భావించిన చిత్ర యూనిట్ ఆమె స్థానంలో రమ్య కృష్ణ ను ఎంపిక చేసినట్టు సమాచారం. రమ్యకృష్ణ కూడా పారితోషికం అంతగా డిమాండ్ చేయలేదని… అందుకే ఆమెను తీసుకున్నట్టు సమాచారం. కరోనా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version