ఏపీ పాలిటిక్స్‌లో త‌న‌యుల కోసం తండ్రుల క‌ష్టాలు… స‌క్సెస్ అవుతారా…!

-

రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌తంగా ఎద‌గాల‌నే తృష్ణ‌, స్వంతంగా పైకి రావాల‌నే అభిలాష‌లే కాదు.. ప్ర‌జ‌ల‌ను కూడ‌గ ట్ట‌గ‌ల నేర్పు, ఓ అర‌గంట సేపు అన‌ర్గ‌ళంగా మాట్లాడి ప్ర‌జ‌ల‌ను మెప్పించే సామ‌ర్ధ్యం.. విష‌యం ఏదైనా స‌రే కౌంట‌ర్లు ఇచ్చే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రించ‌డం అనేది నాయ‌కుల‌కు పెట్ట‌ని కోట‌లుగా ఉండాల్సిన ప్ర‌ధాన అర్హ‌త లు. అయితే, నేటి త‌రం యువ నాయ‌కుల‌కు ఈ త‌ర‌హా ప్ర‌ణాళిక‌, ప్ర‌జ‌ల‌నుంచి గెలుద్దామ‌నే తాప‌త్ర‌యం వంటివి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా .. వారు ఏవిష‌యంలోనూ కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఏదైనా ఒక రాష్ట్ర అంశంపై అన‌ర్గ‌ళంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చో.. టీవీ చానెళ్ల‌లోనో ప్ర‌సంగించే ప‌రిస్థితి కూ డా వారిలో క‌నిపించ‌డం లేదు. దీంతో రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నే వారి ప్ర‌య‌త్నాలు ఎక్క‌డివ‌క్క‌డే అనే చం దంగా మారిపోయాయి. ఈ క్ర‌మంలోనే వారి తండ్రులు ఇప్పుడు త‌న‌యుల కోసం, కుమార్తెల కోసం తాప త్రయ ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లాలో క‌ర‌ణం బ‌ల‌రాం త‌న కుమారుడు వెంక‌టేష్‌ను వైసీపీలో చేర్చారు. నిజానికి ఎప్పుడో త‌న కుమారుడికి రాజ‌కీయంగా మంచి స్థానం క‌ల్పించి చూసి త‌రించాల‌ని, పుత్రోత్సాహంతో పండ‌గ చేసుకోవాల‌ని అనుకున్నారు.

ఈ క్ర‌మంలోనే 2014లో టీడీపీ త‌ర‌ఫున అద్దంకిలో త‌న కుమారుడు వెంక‌టేష్‌కు టికెట్ ఇప్పించుకున్నా రు. కానీ, ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ బాట‌ప‌ట్టారు. అదేవిధంగా గాదె వెంక‌ట‌రెడ్డి కుమారుడు మ‌ధుసూద‌న్ రెడ్డి కోసం ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఇక‌, మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ రావు త‌న త‌న‌యుడు కోసం .. ఆప‌శోపాలు ప‌డుతున్నారు. నిజానికి త‌న‌యుల మాట ప‌క్క‌న పెడితే.. తండ్రులు రాజ‌కీయాల్లో ఎదిగిన విధానాన్ని గ‌మ‌నించాల్సి ఉంటుంది, వారంత‌ట వారే రాజ‌కీయాల్లో ఎదిగారు. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొన్నారు. వ్యూహాత్మ‌కంగా మ‌సిలారు. ఇలాంటి వ్యూహం లోపించిన‌న్నాళ్లు.. త‌న‌యులు ఎన్నిచేసినా స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version